ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల వేడిని రాజేసినట్టే కనిపిస్తోంది. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రారంభించిన క్యాంపైన్ వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాలను కలిసినట్లు ప్రకటించింది వైసీపీ. జగన్ కు మద్దతుగా 47 లక్షల మందికి పైగా మిస్డ్ కాల్ చేసినట్లు వెల్లడించింది. క్యాంపైన్ ప్రాంరంభంచి వారం రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని వెల్లడించింది. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపైన్ కొనసాగనుంది. మెగా పబ్లిక్ సర్వే వివరాలను వైసీపీ ఈ నెల 21 తర్వాత ప్రజల ముందు పెట్టనుంది.
అధికార వైసీపీ ఎన్నికల క్యాంపైన్ కసరత్తు ముమ్మరం చేస్తోంది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో పార్టీ నియమించిన దాదాపు 7 లక్షల మంది గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు సుమారుగా 63 లక్షలకు పై చిలుకు ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్పంచుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించటం ఈ కార్యక్రమం ప్రధాన ఎజెండా.
Read Also: IPL 2023 RCB Vs DC: ఆర్సీబీ బౌలర్ల హవా..ఢిల్లీపై బెంగళూర్ ఘన విజయం..
దీనిలో భాగంగానే తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా , భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించ మంటరా అనే ఐదు రకాల ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమాధానాలే పార్టీకి క్షేత్ర స్థాయిలో ఈ ప్రభుత్వం పై ప్రజా అభిప్రాయం ఎలా ఉందో అర్థం చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వారం రోజుల్లో జగన్ పట్ల తమ మద్దతును వ్యక్తం చేస్తూ సుమారుగా 47 లక్షల మంది మిస్డ్ కాల్స్ చేశారని మంత్రులు ప్రకటించారు.
ఈ నెల 20వ తేదీ వరకు ఈ క్యాంపైన్ కొనసాగనుంది. రెండు వారాల జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్ పూర్తి అయిన తర్వాత మెగా పబ్లిక్ సర్వే ఫలితాలను పార్టీ ప్రజల ముందు పెట్టనుంది. జగనే మా నమ్మకం అన్న క్యాంపైన్ కు మరింత వేడి పుట్టించే వ్యూహాలకు పదును పెడుతోంది. గత ఎన్నికల సమయంలో క్యాంపైన్ చేసిన తరహాలోనే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ పై పార్టీ నేతలు ఎన్ని ఇళ్ళను సందర్శించారు, ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి అన్న సమాచారం లైవ్ లో ఎప్పటికప్పుడు డిస్ ప్లే అవుతూ ఉంటాయి. పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన ఈ డిస్ ప్లే క్యాంపైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also: Amit Shah: “పైలట్ జీ మీ నంబర్ ఎప్పుడూ రాదు”.. రాజస్థాన్ కాంగ్రెస్ పోరుపై అమిత్ షా వ్యాఖ్యలు..