వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీకి వివరించారు. రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు.…
వరంగల్ హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అన్నారు ప్రజలంతా టీఆర్ఎస్ పాలనపై అసహనంతో వున్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు. ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం…
బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు లక్ష్మణ్. వెనుకబడిన పాలమూరు ప్రజలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం దగా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని తెరాస నేతలు పదే పదే…
కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు..గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమికి వర్గ విబేధాలే కారణం కాగా రాబోవు ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కింది స్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్నా అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినబడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాట గా మారింది. కరీంనగర్ జిల్లా…
తెలంగాణలో కాంగ్రెస్- ఎంఐఎం మధ్య దోస్తీ వుందని భావిస్తున్న వేళ రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లభించింది. ఢిల్లీలో జరిగిన భేటీలో కీలకాంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని అడిగిన సీనియర్లకు రాహుల్ బదులిచ్చారు. ఆ రెండుపార్టీలతో దోస్తీ లేదన్నారు రాహుల్ గాంధీ. సమావేశంలో తెలుగులో మాట్లాడారు మాజీ మంత్రి జానారెడ్డి. జానారెడ్డి వ్యాఖ్యలు ఇంగ్లీషులో తర్జుమా చేసి రాహుల్ కి వివరించారు టీపీసీసీ మాజీ చీఫ్…
రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. రాహుల్ తో సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటూ ఇతర…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితంలో ఒక్క గజం స్థలం కబ్జా చేసినట్లు రుజువు చేసినా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దం అని సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై భగ్గుమన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మాజీ…
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన మన ఊరు-మన పోరు సభ ముగిసింది. 35 వేల మెజారిటీతో సురేందర్ ని గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించే సమయం కూడా లేదు. ఒక్క ఎమ్మెల్యే డబ్బులు పెట్టుకుంటే వందలాది కరడుగట్టిన సైనికులను తయారు చేస్తాం.టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు నీరు, ఉచిత విద్యుత్ ఇచ్చామని…
రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బలమయిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో బండి సంజయ్ అనేక అంశాలు ప్రస్తావించారు. రెండేళ్ళ పదవీకాలం చాలా సంతృప్తినిచ్చింది. అందరి సహకారం, నేతల సలహాలతో లక్ష్యాల వైపు అడుగులేశా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తెస్తాం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మేం గెలిచాం. టీఆర్ఎస్ డబ్బులు బాగా ఖర్చుపెట్టింది. నియోజకవర్గాలు అన్నింటిలో మేం పోటీచేశాం. మాకు నాయకులు తక్కువ…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యింది.…