తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం…
రాబోయే ఏడాది మళ్ళీ ఎన్నికల సంరంభం ప్రారంభం కానుంది. కానీ గులాబీ నేతలు మాత్రం తమ మధ్య విభేదాలు వీడడం లేదు. పెద్దబాస్, చిన్నబాస్ ఎన్ని చెప్పినా ప్రగతిభవన్ లో విని వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయంగా మాటల తూటాలు పేల్చుకున్న కొల్లాపూర్ నేతలు , ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో దూషించుకుంటున్నారు. ఇదంతా అధికార విపక్ష పార్టీ నేతల మధ్య అనుకుంటే మీ బిర్యానీలో కాలేసినట్టే. ఈ సీన్ అంతా అధికార టీఆర్ఎస్ లోనే కొనసాగుతుండటంతో…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీసర వేదికగా చింతన్ శిబిర్ కార్యక్రామాన్ని నిర్వహించింది. దీంతో పాటు తెలంగాణలోని సమస్యలు, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఎలా ఎండగట్టాలనే విషయాలపై చర్చ జరిగింది. దీంతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, సంస్థాగత, రైతులు, యువత ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని తెలంగాణ సమస్యలపై చర్చించారు. బుధవారం, గురువారం రెండు రోజులు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో…
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి. దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు..…
తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకం తెలుగుదేశం పార్టీ అనేవారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తీవ్ వత్తిడిలో వుంది. 40 ఏళ్ళ పండుగను గర్వంగా జరుపుకుంటున్నామని చెబుతున్నా. భవిష్యత్ సవాళ్ళు టీడీపీ నేతల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండురోజుల మహానాడు జరుగుతోంది. రాబోయే కాలం అంతా టీడీపీ నేతలకు పరీక్షా కాలమే అని చెప్పాలి. టీడీపీలో సంస్ధాగతంగా…
తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఇంతకుముందు వరంగల్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ సమరానికి సై అన్నారు. తాజాగా బీజేపీ నేత, బాద్ షా అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మరోమారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ…
కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని… టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ…
24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు కుక్కల్లా మొరుగుతున్నారు.. ఎంతైనా మొరగండి.. జడ్చర్ల ప్రజలకు న్యాయం చేయండని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పేదలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను కేసీఆర్ ధరణి పేరుతో లాక్కుంటూ నిలవనీడలేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న టీఆర్ఎస్ నేతలు.. గుంట నక్కల్లా ఇసుక, మట్టి,…
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరుతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరుకి రణనినాదం చేసింది తెలంగాణ కాంగ్రెస్. 2023లో రాబోయే ఎన్నికలకు నాందిగా సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. బ్రిటీషు బానిస సంకెళ్ల విముక్తి నుండి స్వాతంత్ర్య భారత నిర్మాణానికి పునాది రాయి వేసే వరకు… భిన్నత్వంలో ఏకత్వంగా జాతిని ఐక్యం చేయడం నుండి నవ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక భారతావని నిర్మాణం వరకు… ఈ దేశ గమనంలో, గమ్యంలో కాంగ్రెస్…