Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.