అమెరికాలో ఒక వ్యక్తి తన జీవితంలో 172 సార్లు విషసర్పాల కాటుకు గురయ్యాడు. 20 సార్లు అతని పరిస్థితి విషమించింది.. దాదాపు ప్రాణాలు వదిలేసిన పరిస్థితి వచ్చింది. అయినా అతను 100 సంవత్సరాలు బతికాడు. 2011 సంవత్సరంలో ఆయన మరణించాడు. ఈ వ్యక్తిని అమెరికాలో 'స్నేక్ మ్యాన్' అని పిలిచేవారు. అతని పేరు బిల్ హాస్ట్. పదే పదే పాము కాటుకు గురై వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలనుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి పాములంటే ప్రత్యేక ఆకర్షణ…