శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం –…