అగ్నిపథ్ స్కీమ్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులకు మరిన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు. దేశంలో ‘ అగ్నిపథ్ ’పై జరుగుతున్న ఆందోళన గురించి చర్చించారు. అగ్నిపథ్ కింద కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే ఆర్మీలో చేర్చుకోవడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని…