కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. సూర్యకు సపోర్ట్ గా #WeStandWithSuriya అనే ట్యాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. సూర్య హీరోగా, జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన “జై భీమ్” సినిమా అక్టోబర్ 2న విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోయింది. ఇటీవల సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మేకర్స్ సన్నివేశాన్ని మార్చినప్పటికీ క్యాలెండర్ వివాదం సద్దుమణగలేదు సరికదా ఇప్పుడు…