విశ్వనటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ద్రోహి’. దేశానికే సవాలు విసురుతున్న టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వేసే ఎత్తులు, జిత్తుల నేపథ్యంలో ఇవాళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ మూలం ‘ద్రోహి’ అనే చెప్పాలి. రొటీన్ ఫిల్మ్ మేకింగ్ పాత్ ను బ్రేక్ చేస్తూ, కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కమల్ పాతికేళ్ళ క్రితమే ‘ద్రోహి’ని తీశారు. హిందీ చిత్రం ‘ద్రోహ్ కాల్’కు ఇది రీమేక్. అక్కడ ఓంపురి, నజీరుద్దీన్ షా ప్రధాన…