Yuzvendra Chahal Creates Sensational Record In IPL: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ తాజాగా సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు చాహల్.. ఈ సందర్భంగా చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఇప్పటివరకూ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజా మ్యాచ్‌తో చాహల్ 183 పడగొట్టి, బ్రావోతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. అయితే.. బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీస్తే, చాహల్ 141 మ్యాచ్‌ల్లోనే ఆ ఫీట్ సాధించేశాడు. తద్వారా.. టీమిండియా తరఫున ఐపీఎల్‌లో హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
8.08 ఎకానమీ రేటుతో 19.41 అత్యుత్తమ సగటుతో 183 వికెట్లు తీసి.. చాహల్ తన పేరిట అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. చాహల్, బ్రావోల తర్వాత పియూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో, అమిత్ మిశ్రా 172 వికెట్లతో నాలుగో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. తొలుత చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరఫున 2014-2021 వరకు ఆడాడు. ఆ సమయంలోనే అతడు క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ వ్రిస్ట్-బౌలర్‌గా అవతరించాడు. RCB తరపున మొత్తం 113 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2022 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న చాహల్.. 28 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు.
Boat Accident: విషాదం.. బీచ్ వద్ద పడవ బోల్తా.. 21 మంది దుర్మరణం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అనంతరం 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. చివర్లో నో-బాల్ పుణ్యమా అని 217 పరుగులు చేసి, రాజస్థాన్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి ఇదే అత్యుత్తమ ఛేజ్. ఒకానొక దశలో హైదరాబాద్ జట్టు ఓడిపోతుందని అనుకున్న తరుణంలో.. ఫిలిప్స్ విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక చివరి బంతికి అబ్దుల్ సమద్ సిక్స్ కొట్టి, జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంలో ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి.