ఉమెన్సీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం ( మార్చ్ 26 ) జరిగే ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనుంది. అయితే పురుషుల తొలి సీజన్ ఐపీఎల్ అడుగుజాడల్లో WPL ముగింపు దశ కూడా నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రపంచంలోనే ఎంతో మందిని ఆకర్షించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. అయితే ఐపీఎల్ మొదలైన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు కూడా ఒక లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వెంటవెంటనే ఏర్పాట్లూ జరిగిపోయాయి. మహిళల ప్రీమియర్ లీగ్ పై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది. వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకే WPL మొదలైంది.
Also Read : Robot Man Of India: ‘రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా’.. పీఎస్‌వీ కిషన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
అచ్చం ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది. తన ప్రత్యర్థి కోసం వెయిటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ముంబయితో తలపడనుంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఈ లీగ్ అంతా అద్భుతంగా రాణించి తమ జట్టును పైనల్ చేర్చింది. లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్ లు గెలిచింది.
Also Read : Donald Trump: నన్ను టచ్ చేస్తే విధ్వంసమే.. ట్రంప్ వార్నింగ్..
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం గమనించాల్సి ఉంది మీరు.. 2008లో తొలి ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ చేరిన జట్లు ఏవో మీకు గుర్తుకు ఉండి ఉంటాయి. అయినా సరే మరోసారి గుర్తు చేస్తాను.. రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ కి అప్పటి టీమిండియా కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తుండగా రాజస్థాన్ కు ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు WPL ఫైనల్ లో కూడా ముంబయికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథిగా ఉండగా.. ఢిల్లీకి ఆసీస్ కెప్టెన్ లానింగ్ సారథ్యం వహిస్తుంది. మరి అప్పట్లో షేన్ వార్న్ గెలిచినట్లే.. లానింగ్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా.. లేక హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి..