నా చివరి మ్యాచ్ చెన్నైలోనే : ధోని

యూఏఈలో ముగిసిన ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని భవిష్యత్ పై చాలా ప్రశ్నలు వస్తున్న విషయం తెలిసిందే. తాను వచ్చే ఏడాది ఐపీఎల్ అడవుతాడా.. లేదా అనేదాని పై చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే గతంలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలోనే ఆడుతాను అని చెప్పిన ధోని మరోసారి అవే వ్యాఖ్యలు చేసాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ధోని మాట్లాడుతూ… నేను ఇండియాలో ఆడిన నా చివరి వన్డే మ్యాచ్ నా హోమ్ టౌన్ అయిన రాంచీలో ఆడాను. అలాగే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ కూడా చెన్నైలో ఆడుతాను. కానీ అది వచ్చే సీజన్ లోనా… లేక ఐదేళ్ల తర్వాతనా అనేది నాకు తెలియదు. అని స్పష్టం చేసాడు. ఇక గత ఏడాది చెన్నై విజయంలో కెప్టెన్ గా కీలక పాత్ర పోషించిన ధోనిని ఈ ఏడాది జరగనున్న మెగా వేలంలో తిరిగి ఆ జట్టు సొంతం చేసుకుంటుందా… లేదా అనేదాని పైన ప్రశ్నలు వస్తున్నాయి.

Related Articles

Latest Articles