ఐపీఎల్ 2022 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా వేలానికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ నిర్వహించనుంది. కర్ణాటక ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం హోటల్ బుకింగ్ ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. తాజాగా ఐపీఎల్ పాలకమండలి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.
Read Also: స్వదేశంలో భారత్‌ను ఓడించే సత్తా ఉంది: జేసన్ హోల్డర్
వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ ఉండటం విశేషం. మనోజ్ తివారీ బెంగాల్ క్రికెటర్. తివారీ గతంలో టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఆయన 12 వన్డేలు, 3 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మనోజ్ తివారీ చివరిసారిగా 2018లో ఐపీఎల్ ఆడాడు. ఈసారి వేలంలో మనోజ్ తివారీ తన కనీస ధరను రూ.50 లక్షలుగా పేర్కొన్నాడు. గతంలో మనోజ్ తివారీ ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్లకు ఆడిన సంగతి తెలిసిందే.