Virat Kohli In Danger Zone: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్, స్టాండ్‌ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈరోజు కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటెయిన్ చేస్తే.. కోహ్లీకి భారీ ఎదురుదెబ్బలు తగులుతాయి. అతనిపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు రూ.30 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. అతనితో పాటు జట్టులోని మిగతా సభ్యులంతా (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దిష్ట సమయంలో (90 నిమిషాల్లో) తమ కోటా ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే.. పైన చెప్పుకున్న తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
India: పాకిస్తాన్‌లో దాక్కున్న 23 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ..
అసలు స్లో ఓవర్ రేట్ రూల్ ఏమిటంటే.. 20 ఓవర్ల కోటాను ప్రతీ జట్టు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే.. తొలిసారి ఆ జట్టు కెప్టెన్‌కు మాత్రమే రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే.. కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించడం జరుగుతుంది. మూడోసారి కూడా అదే తప్పు చేస్తే మాత్రం.. కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. అంతేకాదు.. అతనికి రూ.30 లక్షల జరిమానా.. జట్టు సభ్యులకు 12 లక్షల జరిమానా లేదా 50 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత విధించబడుతుంది. ఆర్సీబీ ఆల్రెడీ రెండు సార్లు స్లో ఓవర్ రేట్‌ని మెయింటెయిన్ చేసింది. ఒకవేళ మూడోసారి కూడా ఆ తప్పు చేస్తే.. దాని పర్యవసానాలేంటో తెలుసుగా! కాబట్టి.. కోహ్లీ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
Extramarital Affair: మరో వ్యక్తితో భార్య పాడు పని.. కోపంలో భర్త ఏం చేశాడంటే?
ఇదిలావుండగా.. గత పదిహేను సీజన్ల నుంచి ఒక్కసారి కూడా కప్ గెలవని ఆర్సీబీ జట్టు, ఈసారైనా కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ, వాటిల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టాప్-4లో స్థానంలో సంపాదించాలంటే.. ఆర్సీబీ జట్టు మంచి రన్ రేట్ మెయింటెయిన్ చేస్తూ, విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరి, ఈసారైనా ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్తుందా? అభిమానుల కోరిక మేరకు కప్ కొడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!