Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్‌బై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో వెలుగుచూసిన ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ వివాదం రోజురోజుకూ మరింతగా ముదురుతోంది. బ్యాట్‌కు బంతి తగలకపోయినా.. స్లిప్ ఫీల్డర్ చేతి వేళ్లతో చిటికె వేసి ఎడ్జ్ అయినట్లు శబ్దం సృష్టించి పలువురు బ్యాటర్లను అవుట్ చేయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. తాజాగా ఇలానే ఓ బ్యాటర్ ఔట్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ ఇప్పటికే అధికారిక విచారణ ప్రారంభించింది.
వైరల్ అయిన వీడియోలో కనిపించింది సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ ఆటగాడు బ్రియాన్ డివైన్. ఇప్పుడు అతడి పైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అభిమానులు అతడికి ‘క్లిక్కీ పాంటింగ్’ అనే పేరు పెట్టారు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ పేరును ఉద్దేశించి ఇలా వ్యంగంగా నామకరణం చేశారు. ఈ ఘటనపై మిడిల్స్‌బ్రో క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ కెప్టెన్ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయని ఆరోపించాడు. యువ బ్యాటర్ల ఆత్మవిశ్వాసంపై ఈ ఘటనలు ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
- Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
ఈ వివాదం పెద్దది కావడంతో బ్రియాన్ డివైన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక భారతీయ రెస్టారెంట్ ‘స్పైసెస్’ అతనికి అందిస్తున్న స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నట్లు ఓ బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రముఖ బ్రిటిష్ టీవీ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘క్లిక్కీ పాంటింగ్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద మోసగాడు. ఇలాంటి పని అతను ఎంతకాలంగా చేస్తున్నాడు?, ఎంతమంది బ్యాటర్లను ఇలా అవుట్ చేశాడు’ అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!