Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తాను మరోసారి నిరూపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యువ బ్యాట్స్‌మన్, తాజా ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి ప్రపంచ టాప్-50లో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ రెండు అర్ధశతకాలతో మొత్తం 151 పరుగులు చేశాడు. 50.33 సగటుతో బ్యాటింగ్ చేసి భారత్‌కు 3-0తో సిరీస్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానానికి చేరుకున్నాడు.
భారత ఆటగాళ్లలో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకోగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక వన్డే క్రికెట్లో భారత జట్టుకు మరో శుభవార్త అందింది. న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో భారత క్రికెట్‌కు ఒకేసారి ఇద్దరు యువ ఆటగాళ్ల నుంచి సంతోషకరమైన వార్తలు అందాయి.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
బౌలింగ్ విభాగంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమైన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు దిగజారినప్పటికీ టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ వేగంగా ఎదుగుతున్న తీరు భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచుతోంది. చిన్న వయసులోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-50లో చోటు దక్కించుకోవడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!