Cockroach: 30 కోట్ల ఏళ్ల హీరో.. బొద్దింకల తెలివికి సైంటిస్టులే షాక్ అయ్యారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన కంటికి బొద్దింక అంటే చిన్న పురుగు మాత్రమే. అది కనిపించిందంటే తరిమేయాలి అనిపిస్తుంది. అయితే అదే చిన్న జీవి… పెద్ద పెద్ద శాస్త్రవేత్తలనే ఆలోచనలో పడేసింది. ఒక్క బొద్దింకకు లేని మెమరీ… మొత్తం గ్రూపుకు ఉంటుందట. అన్నీ కలిసి ఒకే మనసు, ఒకే మెదడులా ప్రవర్తిస్తాయట. వినగానే ఆశ్చర్యంగా ఉంది కదా… కానీ ఈ విచిత్రమైన నిజాన్ని తాజాగా ఒక పరిశోధన బయటపెట్టింది. బొద్దింకలన్నీ గ్రూపుగా ఉన్నప్పుడు వాటి జ్ఞాపకశక్తి కలెక్టీవ్గా పనిచేస్తుందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది.
నిజానికి ఈ చిన్న జీవి సామాన్యమైనది కాదు. దాదాపు 30 కోట్ల సంవత్సరాలుగా భూమిపై పరుగులు తీస్తూనే ఉంది.
డైనోసార్లు రాకముందు నుంచే ఈ జీవులున్నాయి. మంచు యుగాలు వచ్చాయి. అగ్నిపర్వతాలు పేలాయి. ఉల్కలు భూమిని ఢీకొట్టాయి. అడవులు మారాయి. వాతావరణం మారింది. కానీ బొద్దింక మాత్రం మారుతున్న ప్రకృతితో పాటు తన జీవితాన్ని కూడా మార్చుకుంటూ ఇప్పటికీ బతికేస్తోంది. అందుకే ప్రకృతి రాసిన సర్వైవల్ కథలో బొద్దింక ఒక పెద్ద హీరో. ఇప్పుడు ఈ హీరో గురించే బెల్జియం శాస్త్రవేత్తలు ఒక చిన్న ఆట ఆడారు. బొద్దింకలు వెళ్లి హాయిగా దాక్కునేలా రెండు చిన్న గదుల్లాంటి చోట్లను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. రెండూ ఒకేలా ఉన్నాయి. కానీ ఒక చోట ఎరుపు వెలుగు, మరో చోట ఆకుపచ్చ వెలుగు పెట్టారు. బొద్దింకలకు ఎరుపు వెలుగు అంటే చీకటిలా అనిపిస్తుంది. చీకటి అంటే వాటికి మహా ఇష్టం. అందుకే అవన్నీ పరుగెత్తుకుంటూ ఎరుపు వెలుగు ఉన్న చోటుకు వెళ్లి గుంపుగా చేరిపోయాయి. కాసేపటి తర్వాత శాస్త్రవేత్తలు ఒక చిన్న మ్యాజిక్ చేశారు. ఎరుపు వెలుగును ఆకుపచ్చగా… ఆకుపచ్చ వెలుగును ఎరుపుగా మార్చేశారు. అంటే ముందు బాగున్న చోటు ఇప్పుడు అంత బాగోలేదు. ఇంకో చోటు ఇప్పుడు మరింత బాగుంది. ఒంటరిగా ఉన్న బొద్దింక అయితే వెంటనే కొత్త చీకటి చోటుకి పరుగెత్తింది. కానీ పెద్ద గుంపు మాత్రం కదల్లేదు. మంచి చోటు ఎదురుగానే ఉన్నా… ముందే కూర్చున్న చోటే అలాగే ఉండిపోయింది.
Also Read
- Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
- Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
- Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
ఎందుకలా జరిగింది? ప్రతి బొద్దింకకు ఆ చోటు గుర్తుందా? కాదు. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఒక్కో బొద్దింకకు ప్రత్యేకంగా ఏమీ గుర్తులేదు. కానీ ఒక బొద్దింకను చూసి ఇంకో బొద్దింక అక్కడే ఉంటుంది. దాన్ని చూసి మరోటి వస్తుంది. ఇలా ఒక్కటి… రెండు… పది… ఇరవై… అందరూ ఒకేచోట చేరిపోయాక… ఆ గుంపే ఒక పెద్ద అయస్కాంతంలా మారిపోతుంది.
బయట పరిస్థితి మారిపోయినా… ఒకరినొకరు వదిలి వెళ్లాలని అనిపించదు. అలా పుట్టిందే కలెక్టివ్ మెమరీ. అంటే ఒక్కదానికి గుర్తు ఉండదు కానీ అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రం గుర్తున్నట్టే ప్రవర్తిస్తారు. ఈ విషయం నిజమేనా అని కంప్యూటర్లో కూడా పరీక్షించారు. అక్కడ కూడా నిజమనే తేలింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. ఈ రహస్యం బొద్దింకలతోనే ఆగిపోలేదు. చేపల గుంపులు… పక్షుల మందలు… చీమల కాలనీలు… తేనెటీగల గుంపులు… చివరికి మనుషులు కూడా చాలాసార్లు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఒక్కరి మెదడులో కాదు… అందరి మధ్య ఉండే బంధంలో కూడా జ్ఞాపకం దాగి ఉండొచ్చని ఈ పరిశోధన చెబుతోంది.
ఇప్పటి వరకు బొద్దింకను చూసి అసహ్యపడిన మనం… ఇకపై దాన్ని చూస్తే ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కోట్ల ఏళ్లుగా ప్రకృతి పరీక్షల్లో పాస్ అవుతూ వచ్చిన ఈ చిన్న జీవి… యూనిటీగా ఉంటే ఒక పెద్ద బ్రెయిన్‌లా పనిచేస్తాయని ప్రపంచానికే కొత్త పాఠం తెలిసివచ్చింది.
తాజావార్తలు
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నట’సింహం’
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
ట్రెండింగ్
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!