Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- విద్యార్థుల నిరసనలపై లోక్‌సభలో వాడివేడి చర్చ.
- అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కిరణ్ రిజిజు కౌంటర్.
- "ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు" అంటూ రుజువులు కోరిన కేంద్ర మంత్రి.
- సభలో చేసే ఆరోపణలు వాస్తవాల ఆధారంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాంటీ-పేపర్ లీక్ బిల్లు, విద్యార్థి నిరసనలపై ప్రతిపక్షం బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. విద్యార్థులపై కాల్పులు జరపడానికి, బలప్రయోగం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ అరోపించారు.
రాహుల్ గాంధీ ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఏ ఆరోపణ అయినా చేయవచ్చని తాను ఈ ఉదాహరణ చెప్పానని కిరన్ రిజిజు అన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
రాహుల్ వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో చేసే ప్రతీ ఆరోపణ వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాందీ చేసే వ్యాఖ్యలు సభా రికార్డుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని, అందువల్ల బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. చర్చ జరిగే సమయంలో ప్రతిపక్షాలు హోంమంత్రి సమాధానం చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై కాల్పుల ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!