IND vs PAK: భారత అండర్–19 జట్టు మరోసారి జూనియర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, రికార్డు స్థాయిలో 12వ టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం భారత్‌కు దక్కుతుంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత జట్టు మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగనుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన…
India vs Pakistan: నేడు (డిసెంబర్ 21 ఆదివారం) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఇందులో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలోనే భారత్ పాకిస్థాన్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ ఎనిమిది వికెట్ల…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి పెను విధ్వంసం సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో భారత్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ మరో తుఫాన్ సెంచరీ బాదాడు. 95 బంతుల్లో 175 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. 14 ఏళ్ల వైభవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. 56 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ…
Google Search Trends: టీమిండియా స్టార్ బ్యాటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 108 పరుగులు సాధించి…
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ తన పవర్ హిట్టింగ్తో చేరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో యూఏఈ-ఎపై కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో 144 పరుగులు చేశాడు. ఆపై పాకిస్థాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 45 పరుగులు బాదాడు. వైభవ్ అవుట్ అయ్యాక భారత్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది.…
IND vs PAK: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్ A జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా పాకిస్తాన్ A చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ A.. తొలి 10 ఓవర్లలో 91 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన భారత్ Aను కేవలం 136 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్య పరిచింది. దీనితో 137 పరుగుల…
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 త్వరలో ప్రారంభం కానుంది. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. ఈ ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన భారత్ ఏ జట్టును ప్రకటించారు. టీ20 స్టార్ జితేశ్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నమన్ ధిర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్స్ ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, యశ్ ఠాకూర్, విజయ్‌కుమార్ వైశాఖ్, అభిషేక్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అన్ని కలిసొస్తున్నాయి. ఇప్పటికే దేశవాళీ క్రికెట్, టీమ్ఇండియా అండర్-19లో అవకాశం దక్కించుకున్న అతడు ఇప్పుడు ఏకంగా భారత్ ఏ స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వైభవ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్…
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో వయసుతో సంబంధం లేకుండా ప్లేయర్లు వస్తున్నారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 2025లో వైభవ్ సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) ఆడిన తీరును ఎవరూ మర్చిపోలేరు. దూకుడైన ఆట తీరుతో ఎక్కడైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సింగిల్స్ తీసినంతా ఈజీగా వైభవ్ సిక్సర్లు బాదేస్తున్నాడు. ఐతే యువ బ్యాటర్ వైభవ్ కెరీర్‌కు…