IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆరంభంలోనే టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20) విఫలమయ్యారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. లంచ్ సమయానికి క్రీజులో పుజారా (12), రిషబ్ పంత్ (29) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాంకు రెండు వికెట్లు, ఖలేద్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది.
Read Also: Andrew Flintoff: రోడ్డుప్రమాదంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌కు తీవ్రగాయాలు.. ఇది రెండోసారి
కాగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో ఎన్నో అవకాశాలు పొందిన అతను.. ఓపెనర్‌గా వచ్చి కూడా ఒక్కటంటే ఒక్క టెస్టు శతకం కూడా చేయలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గిల్ ఫామ్‌లో ఉండటంతో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో అతన్ని తీసుకున్నారు. కానీ ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేదు. అనవసర షాట్‌కు ప్రయత్నించి స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన బంతిని ప్యాడిల్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ దాన్ని చక్కగా అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది.