Andrew Flintoff: రోడ్డుప్రమాదంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌కు తీవ్రగాయాలు.. ఇది రెండోసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andrew Flintoff: ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ మరోసారి ఘోర రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. 2010లో ఫ్లింటాఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి టెలివిజన్ రియాలిటీ షోలలో రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడు. 2019లో ప్రఖ్యాత బీబీసీ స్పోర్ట్స్ షో ‘టాప్ గేర్’లో హోస్ట్‌గా చేరాడు. సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌లో సోమవారం ఫ్లింటాఫ్ కారు ప్రమాదానికి గురైంది. షో టెస్ట్ ట్రాక్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఫ్లింటాఫ్‌ను అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఫ్లింటాఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా టాప్ గేర్ కారు రేసింగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఫ్లింటాఫ్‌కు ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో తనతోపాటు రేస్‌ను హోస్ట్ చేస్తున్న వారితో కలిసి ఫ్లింటాఫ్ కారు రేస్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో గంటకు 125 కి.మీ. వేగంతో వాహనాన్ని నడుపుతుండగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కూడా ఫ్లింటాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Read Also: Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్
ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు మ్యాచ్‌లలో ఫ్లింటాఫ్ ఆడాడు. టెస్టుల్లో 3845 పరుగులు, 226 వికెట్లు.. వన్డేల్లో 3394 పరుగులు, 169 వికెట్లు.. టీ20ల్లో 76 పరుగులు, 5 వికెట్లు పడగొట్టాడు. 2005లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం బాక్సింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవాలని అతడు భావించాడు. ప్రస్తుతం డ్రాగ్ రేస్‌లో హోస్ట్‌గా చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!