IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి విశేష అతిథి ప్రవేశించాడు. ఆ అతిథి ఎవరో అని తెగ ఆలోచించకండి. ఆ అతిథి పాము. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి పాము రావడంతో అభిమానులు భయంతో వణికిపోయారు. 7వ ఓవర్ పూర్తైన తర్వాత ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఒక్కసారిగా పాము గ్రౌండ్‌లోకి రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. పామును చూసి ఆటగాళ్లు కూడా హడలిపోయారు. అనంతరం గ్రౌండ్ సిబ్బంది పామును పట్టుకోవడంతో అందరూ శాంతించారు. పామును పట్టుకున్న అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
గ్రౌండ్‌లో పాము వీడియోను పలువురు మొబైళ్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. పాముకు కూడా టిక్కెట్లు విక్రయించారేమోనని నెటిజన్‌లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టీ20 టిక్కెట్ల కోసం అభిమానులు ఎంత కష్టపడ్డారో అందరూ చూశారు. ఇప్పుడు గౌహతి మ్యాచ్‌లో పాము ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్‌లు ఆసక్తికరంగా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు.
Read Also: Adipurush Teaser Review: మీసాల రాముడితో `ఆదిపురుష్`
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఓపెనర్లు దుమ్ముదులిపారు. రోహిత్ నిదానంగా ఆడగా కేఎల్ రాహుల్ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ (57), రోహిత్ (43) అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 200 పరుగులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోవచ్చు.
Snake 🐍 in the House #INDvsSA pic.twitter.com/CllrcwSfcJ
— Ashwani JP Singh (@ashwanijpsingh) October 2, 2022