IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ఆలౌటైంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, 359/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా.. 112 రన్స్ జత చేసిన తర్వాత మిగతా 7 వికెట్లను చేజార్చుకుంది. 127 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147; 227 బంతుల్లో) దగ్గర బెన్ స్టోక్స్ బౌలింగ్ లో జెమ్మి స్మిత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134; 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్!
అయితే, తొలి రోజే యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్ శుభ్ మన్ గిల్, పంత్ కూడా అద్భుతమైన శతకాలు చేయడంతో భారత్ స్కోర్ 471కి చేరుకుంది. మరోవైపు, ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.