అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉందని ప్రచారం జరిగింది, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మలయాళ నటుడు, దర్శకుడైన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది.
Also Read : Dhanush: మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ బాసూ!
ఇంకేముంది, గతంలో బాసిల్ జోసెఫ్‌కి సోనీ ఆఫర్ ఇచ్చిన ‘శక్తిమాన్’ సినిమాను ఆయన అల్లు అర్జున్‌తోనే చేస్తున్నాడని, అల్లు అర్జున్‌ని కలిసి కథ చెప్పగా ఆయనకు నచ్చిందని ఇలా ప్రచారం మొదలైంది. అయితే, ఇది నిజం కాదని తాజాగా బాసిల్ జోసెఫ్ వెల్లడించాడు. ఎవరూ ‘శక్తిమాన్’ చేయడం లేదని, ఒకవేళ చేస్తే అది రణవీర్ సింగ్‌తో తప్ప ఎవరితోనూ చేయలేమని చెప్పుకొచ్చాడు. దీంతో బాసిల్ జోసెఫ్ అల్లు అర్జున్‌తో ‘శక్తిమాన్’ చేస్తున్నాడనే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ వచ్చేసింది.
Also Read : SahaKutumbhanam: ఆసక్తి రేకెత్తించేలా ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ “స:కుటుంబానాం” టీజర్.
నిజానికి, బాసిల్ జోసెఫ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథను ప్రొడ్యూస్ చేయాలని కోరడంతో గీతా ఆర్ట్స్ కూడా దానికి ఒప్పుకుంది. అయితే, ఒక మలయాళ దర్శకుడు వచ్చి అల్లు అర్జున్ తండ్రి ఆఫీస్‌లో మాట్లాడి వెళ్లడంతో, అది అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేశాడనే ప్రచారం మొదలైంది. మొత్తం మీద, ఇప్పుడు ఆయనే స్వయంగా స్పందించడంతో కొంత క్లారిటీ వచ్చినట్లు అయింది.