t20ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుపై త్వరలో జరగనున్న బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుందని ఓ అధికారి తెలిపారు. వరుస ఓటములు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, కోహ్లీని వన్డే సారథ్యం నుంచి కుడా తప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
వన్టేలు, టీ20లకు రోహిత్ లేదా మరెవరైనా.. టెస్టులకు కోహ్లీని సారథిగా ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కోహ్లీకి ప్రముఖుల మద్దతు పెరుగుతుంది. వరల్డ్ కప్‌లో ఓటములకు కోహ్లీని కొందరూ నెటిజన్లు బాధ్యుడిని చేస్తూ విరాట్ కూతురును రేప్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలబడ్డారు.