MS Dhoni: భారత్- పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-A మ్యాచ్‌కు ముందు ఉస్మాన్ తారిక్ పేరు ఎక్కువగా చర్చకు వస్తుంది. తన ప్రత్యేకమైన స్టాప్- అండ్-పాజ్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌తో ఈ ఆఫ్ స్పిన్నర్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కాగా, ఇప్పటి వరకు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తారిక్ 11 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్‌కు ఆరు పరుగుల కంటే తక్కువ ఎకానమీ రేట్‌తో రాణిస్తున్నాడు. మొత్తంగా 42 టీ20 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీసి తనలోని ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇక, రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత బ్యాటర్లకు అతను పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
Read Also: Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్
అయితే, పాకిస్థాన్ ఉస్మాన్ తారిక్ ని వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోంది. యూఎస్ఏ బ్యాటర్లు అతని యాక్షన్‌కు ఇబ్బంది పడ్డారు.. స్పష్టమైన మోమెంటమ్ మార్పు లేకపోయినా వేగంలో మార్పు చూపించడం తారిక్ ప్రత్యేకత అని చెప్పాలి. కాగా, 28 ఏళ్ల తారిక్ జీవితంలో ఆసక్తికర మలుపు జరిగింది. ఒక దశలో క్రికెట్‌లో పెద్ద పేరు సంపాదించాలన్న ఆశలు వదిలేశాడు.. కానీ, 2016లో MS Dhoni జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా చూసిన తర్వాత మళ్లీ ప్రేరణ పొందాడు. ఆ సినిమా చూసిన తర్వాత నేనూ సాధించగలనని నమ్మకం వచ్చింది అని పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Also: Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ఇక, దుబాయ్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని చేసిన తారిక్, ఆ తరువాత కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో 20 వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. గత ఏడాది తన పెళ్లి సమయంలోనే పాకిస్థాన్ జాతీయ జట్టులో ఎంపికైనట్లు కోచ్ చెప్పడంతో మొదట ఇది జోక్ అనుకున్నాడట.. ఆ తర్వాత “నా భార్య అదృష్టం తీసుకొచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయితే, అతని బౌలింగ్ యాక్షన్‌పై వివాదం కూడా చెలరేగుతుంది. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిప్ పీటర్సన్ ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌లో ఉన్న పాజ్‌ను “అక్రమం”గా అభివర్ణించగా, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
