Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Usman Tariq Rise Ms Dhoni Inspiration Story

MS Dhoni: పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ ఎదుగుదలలో ఎంఎస్ ధోని కీలక పాత్ర..

Published Date :February 14, 2026 , 9:56 am
By Chandra Shekhar Pamena
  • భారత్- పాక్ మ్యాచ్‌కు ముందు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై చర్చ..
  • కొలంబోలోని ఆర్. ప్రేమదాస పిచ్‌పై తారిక్ సవాల్.. భారత జట్టుకు కొత్త పరీక్ష..
  • పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ ఎదుగుదలలో ఎంఎస్ ధోని కీలక పాత్ర..
MS Dhoni: పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ ఎదుగుదలలో ఎంఎస్ ధోని కీలక పాత్ర..
  • Follow Us :
  • google news
  • dailyhunt

MS Dhoni: భారత్- పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-A మ్యాచ్‌కు ముందు ఉస్మాన్ తారిక్ పేరు ఎక్కువగా చర్చకు వస్తుంది. తన ప్రత్యేకమైన స్టాప్- అండ్-పాజ్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌తో ఈ ఆఫ్ స్పిన్నర్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కాగా, ఇప్పటి వరకు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తారిక్ 11 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్‌కు ఆరు పరుగుల కంటే తక్కువ ఎకానమీ రేట్‌తో రాణిస్తున్నాడు. మొత్తంగా 42 టీ20 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీసి తనలోని ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇక, రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత బ్యాటర్లకు అతను పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

Read Also: Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్

అయితే, పాకిస్థాన్ ఉస్మాన్ తారిక్ ని వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోంది. యూఎస్ఏ బ్యాటర్లు అతని యాక్షన్‌కు ఇబ్బంది పడ్డారు.. స్పష్టమైన మోమెంటమ్ మార్పు లేకపోయినా వేగంలో మార్పు చూపించడం తారిక్ ప్రత్యేకత అని చెప్పాలి. కాగా, 28 ఏళ్ల తారిక్ జీవితంలో ఆసక్తికర మలుపు జరిగింది. ఒక దశలో క్రికెట్‌లో పెద్ద పేరు సంపాదించాలన్న ఆశలు వదిలేశాడు.. కానీ, 2016లో MS Dhoni జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా చూసిన తర్వాత మళ్లీ ప్రేరణ పొందాడు. ఆ సినిమా చూసిన తర్వాత నేనూ సాధించగలనని నమ్మకం వచ్చింది అని పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read Also: Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు

ఇక, దుబాయ్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని చేసిన తారిక్, ఆ తరువాత కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో 20 వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. గత ఏడాది తన పెళ్లి సమయంలోనే పాకిస్థాన్ జాతీయ జట్టులో ఎంపికైనట్లు కోచ్ చెప్పడంతో మొదట ఇది జోక్ అనుకున్నాడట.. ఆ తర్వాత “నా భార్య అదృష్టం తీసుకొచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయితే, అతని బౌలింగ్ యాక్షన్‌పై వివాదం కూడా చెలరేగుతుంది. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిప్ పీటర్సన్ ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌లో ఉన్న పాజ్‌ను “అక్రమం”గా అభివర్ణించగా, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricket feature story
  • ind vs pak
  • India vs Pakistan
  • ms dhoni
  • MS Dhoni biopic influence

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions