USA vs IRE: సూపర్ 8కు అమెరికా.. టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఔట్!
- అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
- సూపర్ 8కు యూఎస్ఏ
- పాకిస్థాన్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికా సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు సాధించిన అమెరికా.. సూపర్-8 దశకు అర్హత సాధించింది. అమెరికా సూపర్-8 చేరడం ఇదే మొదటిసారి.
వర్షం కారణంగా అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. పాక్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించి.. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉంది. తన చివరి మ్యాచ్ ఐర్లాండ్‌తో జూన్ 16న తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచినా.. నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్ పాకిస్థాన్‌కి నామామాత్ర పోరుగా మిగలనుంది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Son Kills Parents: కొడుకు కాదు కర్కోటకుడు.. తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను చంపేశాడు..
మరోవైపు గ్రూప్-ఏలో భారత్ ఇప్పటికే సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకుంది. ఆడిన మూడింటిలోనూ రోహిత్ సేన గెలిచింది. నేడు కెనడాతో భారత్ తలపడనుంది. ఇది నామమాత్రపు పోరే. ఇందులో గెలిచినా, ఓడినా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కెనడాతో మ్యాచ్‌ను భారత్ మంచి ప్రాక్టీస్‌గా వాడుకోనుంది. సూపర్ 8లో జూన్ 19న దక్షిణాఫ్రికాతో, జూన్ 21న వెస్టిండీస్‌తో అమెరికా తలపడనుంది. జూన్ 23న B1 (ఇంగ్లాండ్/స్కాట్లాండ్) జట్టుతో తలపడనుంది. ఈనెల 20న అఫ్గాన్‌తో, 22న గ్రూప్ D2 (బంగ్లాదేశ్/నెదర్లాండ్స్‌తో, 24న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..