ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Tribute Room Launched: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు ధోనీ అందించిన సేవలు, అతడి విజయాలు, వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఏ ఆటగాడికి లేని విధంగా.. ITC హోటల్స్ ప్రత్యేకంగా ‘MS Dhoni Tribute Room’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చెన్నైలోని ITC గ్రాండ్ చోళ హోటల్లో ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసింది. ధోనీ అభిమానులకు అతడి క్రికెట్ ప్రయాణాన్ని దగ్గరగా అనుభూతి చెందేలా ఈ గదిని ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ ప్రత్యేక గదిలో ధోనీ క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అరుదైన జ్ఞాపకాలను ప్రదర్శిస్తున్నారు. అతడు ఉపయోగించిన జెర్సీలు, సంతకం చేసిన క్రికెట్ వస్తువులు, గ్లౌజులు, స్టంప్స్, ప్రత్యేక ట్రోఫీలను ఇందులో ఉంచారు. ధోనీ కెరీర్లో కీలకమైన విజయాలు, మరపురాని ఘట్టాలను గుర్తుచేసేలా ప్రత్యేక కళాకృతులు, ఫొటోలు, కథనాలను ఏర్పాటు చేశారు.
Also Read
- IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
- Musi Project: హైదరాబాద్ అభివృద్ధికి సీఎం స్పీడ్.. జనవరిలో మూసీ పనులు ప్రారంభం
- 200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
- UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
ఈ గదిలో మరో ప్రత్యేక ఆకర్షణగా ధోనీ ఐకానిక్ జెర్సీ నంబర్ 7 ఉంది. ఈ నంబర్ స్ఫూర్తితో ప్రత్యేకంగా డిజైన్ చేసిన టవల్స్, కుషన్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను అతిథులకు అందించనున్నారు. గదిలోని ఇంటీరియర్ డిజైన్ నుంచి వ్యక్తిగత సదుపాయాల వరకు ప్రతి అంశంలోనూ ధోనీ ప్రత్యేకత కనిపించేలా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ధోనీకి ఇష్టమైన ఆహార పదార్థాల ఆధారంగా ‘ది కెప్టెన్స్ ప్యాంట్రీ’ (The Captain’s Pantry) పేరుతో ప్రత్యేక ఫుడ్ మెనూను కూడా రూపొందించారు. ITC Hotels మాస్టర్ చెఫ్‌లు ఈ వంటకాలను సిద్ధం చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనుభవాలు, జ్ఞాపికలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక ధోనీ క్రికెట్ ప్రయాణాన్ని వివరించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన కూడా ఈ గదిలో ఏర్పాటు చేశారు. రాంచీలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రపంచ క్రికెట్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న ధోనీ ప్రస్థానాన్ని ఇందులో చూపించనున్నారు. అతడి నిరాడంబరత, పట్టుదల, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణాలను ఈ ప్రత్యేక అనుభవం ద్వారా గుర్తుచేయనున్నారు. ధోనీ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా.. అతడి వ్యక్తిత్వం, క్రికెట్‌కు అందించిన సేవలను గౌరవించేలా ITC Hotels ఈ ప్రత్యేక గదిని రూపొందించింది.
ITC Hotels Chennai gave tribute to MS Dhoni in a different way.
A room is dedicated to #MSDhoni full of his Paintings and memories. Everything is preserved in a way which reminds all of his Cricketing journey.
A preservation of his Legacy ❤️ https://t.co/0MaaAsj6jh
— Amit Singh (@RockstarAmit) November 19, 2026
తాజావార్తలు
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
US Tariffs on India: భారత్‌కు ట్రంప్ మరో షాక్.. భారతీయ వస్తువులపై అమెరికా భారీ టారిఫ్‌లకు సిద్ధం!
-
Anupama Parameswaran-Bhogi: ‘భోగి’ ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
-
Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
-
Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
ట్రెండింగ్
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..