200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Magic9 Pro Max Launched: హానర్ (HONOR) నుండి మరో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ విడుదల అయ్యింది. మ్యాజిక్ సిరీస్ పదో వార్షికోత్సవం సందర్భంగా HONOR Magic9 Pro Maxను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో రెండు 200MP కెమెరాలు, భారీ బ్యాటరీ, అత్యాధునిక AI ఫీచర్లతో పాటు ప్రముఖ కెమెరా తయారీ సంస్థ ARRI భాగస్వామ్యంతో రూపొందించిన సినిమాటిక్ వీడియో టెక్నాలజీని అందించింది.
ARRI సినిమాటిక్ కెమెరా టెక్నాలజీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణ ARRIతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్. ఇందులో ARRI LogC3 Curve, ARRI Wide Gamut 3, 10-bit కలర్ డెప్త్ సపోర్ట్ ఉన్నాయి. ARRI CINEMA Mode ద్వారా 4K రిజల్యూషన్‌లో 60fps వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇందులో 14 ప్రీ-సెట్ ARRI Looks, ARRI Look Library ద్వారా 87 కలర్ గ్రేడింగ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే 10-bit 4:2:2 APV వీడియో కోడెక్‌కు సపోర్ట్ ఉంది.
Also Read
- 6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
- 2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
- Motorola Edge 70 Neo 5G: మోటరోలా Edge 70 Neo 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే.. ధర ఎంతంటే?
- Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్‌పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుకవైపు మూడు కెమెరాలను అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 200MP అల్ట్రా నైట్ మెయిన్ కెమెరా, 200MP అల్ట్రా నైట్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. వీటికి తోడుగా 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 55MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా కెమెరా పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా 6nm HONOR Imaging Chip H1ను అమర్చారు. ఇది రియల్ టైమ్‌లో AI నాయిస్ రిడక్షన్ను RAW డేటాపై ప్రాసెస్ చేస్తుంది. 8dB వరకు సిగ్నల్-టు-నాయిస్ రేషియో మెరుగుదల, 14 స్టాప్స్ సినిమాటిక్ డైనమిక్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీడియో రికార్డింగ్‌లో 4K 120fps వరకు సపోర్ట్ ఉంది. అలాగే 20 మీటర్ల దూరం వరకు ఆడియోను రికార్డ్ చేయగల నాలుగు మైక్రోఫోన్ల వ్యవస్థను కూడా అందించారు.
డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ
HONOR Magic9 Pro Maxలో 6.8 అంగుళాల LTPO OLED డిస్ప్లే ఉంది. ఇది 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1320 × 2868 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 10,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 శాతం DCI-P3 కలర్ గామట్, 4320Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్సెట్తో పనిచేస్తుంది. 2nm టెక్నాలజీతో రూపొందించిన ఈ ప్రాసెసర్‌లో 5GHz వరకు క్లాక్ స్పీడ్ కలిగిన Oryon CPU ఉంది. Adreno GPU, Hexagon NPU కూడా ఇందులో ఉన్నాయి. గరిష్ఠంగా 16GB RAM, 1TB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 8,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP68, IP69, IP69K రేటింగ్స్ ఇచ్చారు.
AI ఫీచర్లు, కనెక్టివిటీ
ఈ స్మార్ట్‌ఫోన్ MagicOS 11 ఆధారిత Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేక ఫిజికల్ AI బటన్‌ను అందించారు. దీని ద్వారా AI Screen Suggestions, AI Settings Agent, AI Photos Agent, Google Lens, AI Memory వంటి ఫీచర్లను త్వరగా యాక్సెస్ చేయవచ్చు. Google Gemini సపోర్ట్ కూడా ఉంది. నోటిఫికేషన్లను సంక్షిప్తంగా వివరించే Summarize Notifications ఫీచర్‌ను అందించారు. HONOR కనెక్ట్ ద్వారా ఆపిల్ వాచ్, ఎయిర్ పోడ్స్ వంటి డివైజ్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా iOS, macOS, విండోస్, ఆండ్రాయిడ్ పరికరాలతో ఫైల్ షేరింగ్‌కు సపోర్ట్ ఉంది. Wi-Fi 7, Bluetooth 6.3, NFC, 5G కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర
ప్రస్తుతం HONOR Magic9 Pro Maxను మలేషియాలో 24GB మొత్తం RAM (12GB ఫిజికల్ RAM + 12GB Turbo RAM), 512GB స్టోరేజ్ వేరియంట్లో విడుదల చేశారు. దీని ధర RM5,999 (సుమారు 1,35,205 రూపాయలు). షాడో బ్లాక్, గ్లేసియర్ సిల్వర్, మాస్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రీ-ఆర్డర్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 4 నుంచి మలేషియాలోని రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రీ-ఆర్డర్ చేసేవారికి RM300 ఇన్స్టంట్ డిస్కౌంట్, ఇమేజింగ్ కిట్ కూపన్, Harman Kardon Aura Studio 5 స్పీకర్, మ్యాగ్నెటిక్ కేస్, అదనపు వారంటీ, స్క్రీన్, లిక్విడ్, బ్యాటరీ ప్రొటెక్షన్ ప్యాకేజీలను అందించనున్నారు. అలాగే మూడు నెలల Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5TB క్లౌడ్ స్టోరేజ్ ట్రయల్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియా మార్కెట్లో మాత్రమే లాంచ్ అయింది. భారత్‌లో విడుదల తేదీ, ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Tata Motors Car Price Hike: టాటా కారు కొనాలనుకుంటున్నారా?.. డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. ఎంతంటే?
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!