Rohit Sharma: మీడియా సమావేశం.. నేనున్నానంటూ చేతెత్తిన రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on off-spin bowling in T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టు ప్రకటన రెండు రోజుల అనంతరం గురువారం (మే 2) కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వారు వివరణ ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రకటించిన భారత జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడనే విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. నేనున్నానంటూ రోహిత్ శర్మ తన చేతెత్తాడు. తానే జట్టులో ఆఫ్ స్పిన్నర్ అని రోహిత్ చెప్పకనే చెప్పాడు. ‘మేము జట్టు గురించి చాలా ఆలోచించాం. ఆఫ్ స్పిన్నర్ జట్టులో ఉండాలా? వద్దా? అని చర్చించుకున్నాం. వాషింగ్టన్ సుందర్ ఇటీవల పెద్దగా క్రికెట్ ఆడలేదు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ గురించి చర్చ జరిగింది. అయితే జట్టులో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉండాలనుకున్నాం. ఇటీవల అశ్విన్ పెద్దగా టీ20లు ఆడలేదు. అక్షర్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ మాకు మాకు పనికొస్తుంది. అంతేకాదు అక్షర్ చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Rohit Sharma: నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది చెప్పను: రోహిత్ శర్మ
కెరీర్ ప్రారంభంలో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా రోహిత్ శర్మ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ సత్తా చాటాడు. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్, భారత జట్టుకు బౌలింగ్ చేశాడు. అయితే మెడికల్ టీమ్ సూచనల మేరకు బౌలింగ్ చేయడం మానేశాడు. అయితే కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్.. టీ20 ప్రపంచకప్ 2024లో అవసరమైతే ఆఫ్ స్పిన్నర్‌గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు