2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక వేదికల్లో సంయుక్తంగా జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ప్రపంచకప్ మ్యాచ్‌లు ఎనిమిది వేదికల్లో జరుగనున్నాయి. భారతదేశంలోని అహ్మదాబాద్ (నరేంద్ర మోడీ స్టేడియం), కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), ముంబై (వాంఖడే స్టేడియం),…