Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
- నమీబియాపై ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్
- కేవలం 20 బంతుల్లో అర్ధ సెంచరీ
- 24 బంతుల్లో 61 పరుగులు
- టి20 ప్రపంచకప్ చరిత్రలో అర్ధ సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్
- 6.5 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు – ప్రపంచ రికార్డు
- పవర్‌ప్లేలో భారత్ 86 పరుగులు – అత్యధిక స్కోరు
- పవర్‌ప్లేలో అర్ధ సెంచరీ చేసిన మూడో భారతీయుడు ఇషాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: టి20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ తో అభిమానులను అలరించాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన హిట్టింగ్ పవర్ ను మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ లో మొత్తం 24 బంతుల్లో 61 పరుగులు చేసిన ఇషాన్, 254.17 స్ట్రైక్‌రేట్ తో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.
India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
- Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్‌తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
ఈ అర్ధ సెంచరీతో ఇషాన్ కిషన్ ఒక ప్రత్యేక రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఇదివరకు మహేంద్ర సింగ్ ధోని, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వంటి వికెట్‌కీపర్లు ఈ టోర్నీలో ఆడినా.. వారు ఎవరు ఈ మైలురాయిని చేరుకోలేకపోయారు. అంతేకాదు.. ఇషాన్ దూకుడు బ్యాటింగ్‌తో భారత్ మరో ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. కేవలం 6.5 ఓవర్లలో (41 బంతుల్లో) 100 పరుగులు చేరుకుని, టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది.
ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా భారత్ మొదటి ఆరు ఓవర్లలో 86 పరుగులు చేసి టి20 ప్రపంచకప్‌లో తమ అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. పవర్‌ప్లే లోనే అర్ధ సెంచరీ సాధించిన మూడవ భారతీయుడిగా ఇషాన్ నిలిచాడు.ఇంతకుముందు కేఎల్ రాహుల్ (2021లో స్కాట్లాండ్‌పై 19 బంతుల్లో), రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో) ఈ ఘనత సాధించారు. ఈసారి ఇషాన్ మరింత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
Naresh Comments on Saree: చీర వస్త్రధారణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్! నటుడు సురేష్ ఏమన్నారంటే?
ఇషాన్ కిషన్ తన టి20 ప్రపంచకప్ లో అరంగేట్రాన్ని 2021లో న్యూజిలాండ్‌పై చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత ఈ టోర్నీలో మళ్లీ USAపై 20 పరుగులు చేసిన తర్వాత ఇప్పుడు నమీబియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన పవర్ ఏంటో చూపించాడు.
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!