India vs Pakistan: భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఇక, 15న దబిడి దిబిడే
- భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
- మిత్ర దేశాల విజ్ఞప్తితో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ నిర్ణయం..
- ఈ నెల 15వ తేదీన కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే కొనసాగనుంది. ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ( ఫిబ్రవరి 9న) ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తితో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు తమ టీంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. టీమిండియా- పాక్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన కొలంబోలో జరగనుంది.
Read Also: Naravane Book Leak: మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథ లీక్.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో బయటపడే నిజాలేమిటి.?
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య సుధీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడాలని పాక్ కు తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ పేర్కొన్నాడు. శ్రీలంక ప్రధాని అనురకుమార కూడా పాక్ ప్రధాని షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు దాయాది దేశం వెల్లడించింది. ఇక, పాక్, భారత్, బంగ్లాదేశ్‌లతో ముక్కోణపు సిరీస్‌ను నిర్వహించాలని పీసీబీ పెట్టిన డిమాండ్‌ను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది.
Read Also: Tragedy : పెళ్లి వేడుకలో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి..
ఇక, ప్రపంచకప్‌కు దూరంగా ఉండటంతో బంగ్లాదేశ్ బోర్డుకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పీసీబీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు కూడా పీసీబీ డిమాండ్ చేయగా.. అది ఐసీసీ చేతుల్లో లేదని వెల్లడించింది. అయితే, వచ్చే అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బంగ్లాకు కట్టబెట్టే ఛాన్స్ ని ఐసీసీ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తిరస్కరించడంతో బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించమని ఐసీసీ తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!