9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- POCO X8 Power 5G సెప్టెంబర్ 4న లాంచ్..
- 9000mAh భారీ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్.
- 1.5K AMOLED డిస్ప్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO X8 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫోన్ రాబోతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో (POCO) నుండి X8 5జీని భారత మార్కెట్లో సెప్టెంబర్ 4న విడుదల చేయనుంది. అదే రోజున పోకో ఎక్స్8 పవర్ 5జీ కూడా లాంచ్ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్లో కంపెనీ కొత్త ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనుంది.
లాంచ్‌కు ముందే పోకో X8 5Gకి సంబంధించిన కీలక ఫీచర్లు అధికారిక టీజర్ల ద్వారా వెల్లడయ్యాయి. ముఖ్యంగా భారీ బ్యాటరీ, డిస్ప్లే, డ్యూరబిలిటీపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా కూడా ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
భారీ బ్యాటరీ:
పోకో X8 5Gలో ఏకంగా 9000mah బ్యాటరీని అందించనుంది. సాధారణ వినియోగంలో ఈ బ్యాటరీ 3.2 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉండనుంది. బ్యాటరీని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచేందుకు స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, పీపీఎస్ ప్రోటోకాల్ వంటి ఫీచర్లను కూడా ఫోన్లో అందిస్తున్నారు. బ్యాటరీ సుమారు ఆరేళ్ల వరకు ఆరోగ్యాన్ని కొనసాగించేలా రూపొందించినట్లు పోకో పేర్కొంది.
1.5K 120hz డిస్ప్లే:
డిస్ప్లే విషయానికి వస్తే.. POCO X8 5Gలో 1.5K రిజల్యూషన్‌తో కూడిన 120hz అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. స్క్రీన్ చుట్టూ సన్నని, సమానమైన బెజెల్స్‌ను అందించారు. దీంతో వీడియోలు, గేమింగ్, ఇతర కంటెంట్‌ను మరింత స్మూత్‌గా వీక్షించవచ్చు. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను అందించారు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందించనున్నారు.

IP69K రేటింగ్..
ఈ మొబైల్ కు బిల్డ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఫోన్‌కు IP69K హెవీ డ్యూటీ ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్ ఉంది. అంతేకాకుండా ఎస్జీఎస్ డ్రాప్ రెసిస్టెన్స్ టెస్టింగ్‌ను కూడా ఫోన్ పూర్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. నీటిలోనూ కెమెరాను ఉపయోగించుకునే సామర్థ్యం ఈ ఫోన్లో ఉంటుందని పోకో టీజ్ చేసింది.
ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్:
డిజైన్ పరంగా పోకో మొబైల్ ఫ్లాట్ ఎడ్జ్ చాసిస్‌తో వస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా ఐలాండ్‌ను అందించారు. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే బ్లాక్, ఫ్రాస్ట్ వైట్, ఆరెంజ్/రస్ట్ ఫినిష్‌లలో ఫోన్ లభించే అవకాశం ఉంది. పోకో ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ మోడళ్లలో డిస్ప్లే, బిల్డ్, డిజైన్ విషయంలో కొన్ని పోలికలు ఉండనున్నాయి. రెండు ఫోన్లలోనూ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందించనున్నారు.
ధర:
ప్రస్తుతం ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అలాగే ఇందులో ఉపయోగించిన చిప్సెట్, కెమెరా హార్డ్‌వేర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 4న జరిగే లాంచ్ ఈవెంట్లో వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!