Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఐకానిక్ టైటిల్స్ కు టాలీవుడ్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా చిరంజీవి నటించిన క్లాసిక్ టైటిల్ ‘వేట’ ను ఓ కుర్ర హీరో తన సినిమా కోసం ఫిక్స్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సందీప్ సరోజ్ ఇప్పుడు ఈ ‘వేట’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు స్వయంగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి స్క్రిప్ట్ అందజేయడం విశేషం. ఎస్ఆర్డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంస్థలు సంయుక్తంగా ఈ ‘వేట’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు అశోక్ కోటిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆగస్ట్ 31 సోమవారం నాడు ఘనంగా జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుకలకు నాగబాబుతో పాటు ప్రముఖ దర్శకుడు కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్ కు కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టగా.. సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి ‘వేట’ టైటిల్ తమ కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందని, ఈ టైటిల్ తో వస్తున్న తమ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరాడు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు కేఎస్ రవి కుమార్ ఊర్లో ‘పెదరాయుడు’ తరహాలో ఉండే ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. దర్శకుడు అశోక్ ఫోన్ లో చెప్పిన కథ అద్భుతంగా అనిపించిందని, జెన్ జీ (Gen Z) ఆడియెన్స్‌కి కూడా ఈ మూవీ బాగా నచ్చుతుందని కేఎస్ రవి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సందీప్ సరోజ్ సరసన సాత్విక జంపా హీరోయిన్గా నటిస్తోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ లాగానే ఇది కూడా ఓ సహజమైన గ్రామీణ నేపథ్యంతో సాగే కమర్షియల్ చిత్రమని, అశోక్ చెప్పిన కథ ఎంతో నేచురల్ గా ఉంటూనే కమర్షియల్ పంథాలో సాగుతుందని నిర్మాత ఫణి అడపాక పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!