Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- ప్రధాని మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ
- షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా సమావేశం
- ఉద్రిక్తతల వేళ కీలక అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజధాని బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో ఇరాన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ, పెజెష్కియాన్ ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల తాజా పరిస్థితిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసి, విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పినట్లు ఇరాన్‌కు చెందిన సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్రిక్త పరిస్థితుల వేళ..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇరాన్‌కు భారత్ టాప్-10 వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. అయితే హార్ముజ్ జలసంధి మూసివేత, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది.
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు

అంతకుముందు మార్చి 21న మోడీ, పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. జూన్‌లోనూ ఇరువురు నేతలు ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా మధ్యప్రాచ్య పరిణామాలపై పెజెష్కియాన్ మోడీకి వివరించారు. ఘర్షణను ముగించేందుకు కుదిరిన అవగాహనను మోడీ స్వాగతించడంతో పాటు శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం నిరంతర ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు.
అర్మేనియా ప్రధాని పాషిన్యాన్‌తోనూ మోడీ భేటీ
ఎస్సీవో సదస్సు సందర్భంగా మోడీ అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తోనూ సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మాస్యూటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. పశ్చిమాసియా పరిస్థితితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్-అర్మేనియా సంబంధాలను మరింత లోతుగా, విస్తృతంగా తీసుకెళ్లేందుకు అర్మేనియాతో కలిసి పనిచేయాలని భారత్ ఎదురుచూస్తోందని మోడీ తెలిపారు.
పుతిన్‌తోనూ మోడీ భేటీ?
ఇదిలా ఉండగా.. మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!