Rovman Powell 107 Meter Six Goes Viral: టీ20 ప్రపంచకప్ 2024లో భారీ సిక్సర్ నమోదైంది. వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మాన్ పొవెల్ భారీ సిక్సర్ బాదాడు. ఆదివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో పొవెల్ 107 మీటర్ల సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని ఉగాండా బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా వేయగా.. పొవెల్ ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి భారీ షాట్ ఆడాడు. బంతి లాంగ్ ఆన్ దిశగా మైదానం బయటపడింది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మహమ్మద్ సిరాజ్‌పై వేటు తప్పదా?
ఇదివరకు టీ20 ప్రపంచకప్ 2024లో భారీ సిక్సర్ బాదిన రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 105 మీట్లర్ల భారీ సిక్స్ బాదాడు. ఈ జాబితాలో రహ్మానుల్లా గుర్బాజ్ (105 మీటర్లు), ఆరోన్ జోన్స్ (103 మీట్లర్లు) సిక్సర్లు బాదారు. టీ20 ప్రపంచకప్‌లో భారీ సిక్సర్ బాదిన రికార్డు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 119 మీటర్ల సిక్సర్‌ను నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ సిక్సర్ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. దక్షిణాఫ్రికాపై ఏకంగా 153 మీటర్ల సిక్స్ కొట్టాడు.