Jasprit Bumrah: టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. అగ్రస్థానంలో పసికూన టీమ్స్ బౌలర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah now has the most maiden overs in T20Is: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో బుమ్రాకు ఇది 11వ మెయిడిన్ ఓవర్. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ (10) రికార్డును అధిగమించాడు.
జస్ప్రీత్ బుమ్రా 63 మ్యాచ్‌ల్లో 11 ఓవర్లు మెయిడిన్‌గా వేశాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్ ఓవర్లు వేశాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన జాబితాలో పసికూన టీమ్స్ ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లు వేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కెన్యా బౌలర్ సోంగోచ్ 12 మెయిడిన్ ఓవర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్ జట్లలో అత్యధిక ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్ మాత్రం బుమ్రానే.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. 3 ఓవర్లలో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి.. వికెట్స్ పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ ఉంది. బుమ్రా భారత్ తరఫున 36 టెస్టులు, 89 వన్డేలు, 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 384 వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లోబుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
-
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్‌పై చరణ్ క్రేజీ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?