Adam Gilchrist: రోహిత్ బయట చెప్పిన మాటలను.. మైదానంలో చేసి చూపించాడు!
- రోహిత్ శర్మ అద్భుతం
- గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం
- యువ క్రికెటర్లకు హిట్‌మ్యాన్ స్ఫూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adam Gilchrist on Rohit Sharma Batting against Australia: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాపై రోహిత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను.. రోహిత్ మైదానంలో చేసి చూపించాడన్నాడు. యువ క్రికెటర్లకు హిట్‌మ్యాన్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై కేవలం 41 బంతుల్లోనే రోహిత్ 92 పరుగులు చేశాడు. స్టార్క్, కమిన్స్,హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లను సైతం వదలలేదు. దాంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
Also Read: Kamal Haasan: కావాలనే నా రెమ్యునరేషన్ పెంచా.. కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను అతడు మైదానంలో చేసి చూపించాడు. యువ క్రికెటర్లకు అతడు స్ఫూర్తిగా నిలిచాడు. ఐపీఎల్ 2024 గణాంకాలను చూసి చాలామంది ట్రోల్స్ చేశారు. వాటన్నింటికీ ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చాడు. జట్టులో తన విలువేంటో రోహిత్ చాటి చెప్పాడు. బౌలర్లపై ఎప్పుడు ఆధిపత్యం ప్రదర్శించాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్ ముందుండి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే.. మిగతా ప్లేయర్స్ స్ఫూర్తి పొందుతారు. మ్యాచ్ సమయంలో చాలామంది కెప్టెన్లు ఫలితాల గురించి ఆలోచించం లేదా ఆడే విధానంపై దృష్టిపెడతాం అని అంటారు. రోహిత్ మాత్రం దూకుడుగానే తన ఇన్నింగ్స్ ఉంటుందని చెప్పాడు’ అని తెలిపాడు. ఇక సెమీస్‌లో గురువారం ఇంగ్లండ్ జట్టును భారత్ ఎదుర్కోవాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!