Adam Gilchrist on Rohit Sharma Batting against Australia: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాపై రోహిత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను.. రోహిత్ మైదానంలో చేసి చూపించాడన్నాడు. యువ క్రికెటర్లకు హిట్‌మ్యాన్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై కేవలం 41 బంతుల్లోనే రోహిత్ 92 పరుగులు చేశాడు.…