Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియా ఫాన్స్ ను ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్థాన్‌పై వరుసగా డకౌట్ అయిన అభిషేక్.. తాజాగా నెదర్లాండ్స్‌పై కూడా డకౌట్ గా వెనుదిరగడంతో ఓ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడో బంతికే అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్యన్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు అభిషేక్ ప్రయత్నించగా.. బంతి వేగంగా దూసుకొచ్చి స్టంప్స్‌ను ఎగరగొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ సహచర ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ జెర్సీని ధరించడం గమనార్హం. జెర్సీ మారినా అభిషేక్ రాత మాత్రం మారలేదు.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా మూడు సార్లు సున్నాకే వెనుదిరగడంతో.. భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా ఆశిష్ నెహ్రాతో కలిసి అభిషేక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్), తిలకరత్న దిల్షాన్ (శ్రీలంక) తలో ఐదు డకౌట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌కు ముందు సునీల్ గవాస్కర్ అభిషేక్ శర్మకు ఒక విలువైన సలహా ఇచ్చారు. “అభిషేక్ ఫామ్‌లో ఉన్నాడు.. కానీ, అతను అనవసరంగా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. నా సలహా ఏంటంటే.. ముందుగా ఒక సింగిల్ తీసి ఖాతా తెరవాలి. కాళ్లు వేగంగా కదులుతూ ఒక పరుగు తీస్తే ఆ తర్వాత భారీ షాట్లు ఆడొచ్చు అని పేర్కొన్నారు. అయితే గవాస్కర్ ఇచ్చిన సలహాను అభిషేక్ అమలు చేయలేకపోయాడు.
Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
ఇలా అభిషేక్ డక్ అవుట్ అవుతుంటే.. కొందరు అభిమానులు నీకంటే సంజు మేలు అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో ఒక అడుగు ముందుకు వేసి ఇక ఆయన సేవలు జట్టుకు ఆపేయండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి తన మొదటి ఐసీసీ (ICC) టోర్నీలో ఆడుతున్న అభిషేక్ శర్మ.. సూపర్-8లోనైనా ఫామ్‌లోకి వచ్చి పరుగుల వేట మొదలుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!