Sunrisers Hyderabad Scored 95 Runs In First 10 Overs Against LSG: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ అదరగొడుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 9.5 రన్ రేట్‌తో 95 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (7) మినహాయించి.. టాపార్డర్‌లో మిగిలిన బ్యాటర్లు ఆశాజనకంగా రాణించడంతో.. సన్‌రైజర్స్ స్కోరు ఇలా పరుగులు పెడుతోంది. ఈ జట్టు ఇదే జోరుని కొనసాగిస్తే.. 200 పరుగుల మైలురాయిని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇంకా క్రీజులో మార్ర్కమ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్ లాంటి హిట్టర్స్ ఉన్నారు. వీళ్లందరూ బాగా రాణిస్తే.. ఈరోజు లక్నోకి సన్‌రైజర్స్ పెద్ద లక్ష్యం ఇవ్వొచ్చు.

DK Shivakumar: డీకే శివకుమార్ బర్త్‌డే రోజే కొత్త సీఎం ప్రమాణం.. ఏ గిఫ్ట్ ఇస్తారే మరి..?
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్ తరఫున అన్మోల్ ప్రీత్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేశారు. వీళ్లిద్దరు కలిసి తమ జట్టుకి మంచి శుభారంభమే ఇచ్చారు. అయితే.. ఇంతలోనే అభిషేక్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. అతడు ఔట్ అయ్యాక వచ్చిన రాహుల్ త్రిపాఠి.. వచ్చి రావడంతోనే బాదుడు మొదలుపెట్టాడు. 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లతో అతడు 20 పరుగులు చేశాడు. రెండో వికెట్‌కి త్రిపాఠి, అన్మోల్ కలిసి 37 పరుగులు జత చేశారు. త్రిపాఠి జోరు చూసి.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోతాడని అనుకునేలోపే, పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అన్మోల్ ప్రీత్ కూడా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం మార్ర్కమ్, క్లాసెన్ క్రీజులో బాగా రాణిస్తున్నారు. మరి.. 20 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి.
SRH vs LSG: ఆదిలోనే సన్‌రైజర్స్‌కు హంసపాదు.. తొలి వికెట్ డౌన్