DK Shivakumar: డీకే శివకుమార్ బర్త్‌డే రోజే కొత్త సీఎం ప్రమాణం.. ఏ గిఫ్ట్ ఇస్తారే మరి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్.. ఇలా ఎవరి అంచనాలకు దొరకకుండా గెలుపును తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ.. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. అయితే, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ధరామయ్య సీఎం అవుతారా? ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం చైర్‌లో కూర్చోబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. అదే రోజు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టిన రోజు కూడా ఉంది. దీంతో.. కాంగ్రెస్ అధిష్టానం డీకేకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.. సీఎం పదవి కట్టబెడుతుందా? పార్టీ బాధ్యతలే చూసుకోమంటుందా? అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: DK Shivakumar: “సోనియా గాంధీ మాటిచ్చినట్లే”.. డీకే శివకుమార్ కన్నీరు..
Also Read
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
కాగా, డీకే శివ కుమార్ కర్ణాటక శాసనసభకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.. ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీలో వివిధ హోదాలతో పాటు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పలు శాఖల బాధ్యతలు చేపట్టి విజయవంతంగా నిర్వహించారు.. మరి. ఈ సారి సీఎం చైర్ ఎక్కుతారా? లేదా? అనేది వేచిచూడాలి.. మరోఎవైపు.. కర్నాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన డీకే శివకుమార్.. హర్షం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్న సమయంలో.. సోనియా గాంధీ నన్ను జైలుకు వచ్చి అలా పరామర్శించడం మరిచిపోలేదని ఆయన భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టుకున్నారు. కర్ణాటకను ఆదుకుంటానని సోనియా గాంధీకి మాటిచ్చినట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తానని సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంకాగాంధీకి, మల్లికార్జన ఖర్గేకి తాను హామీ ఇచ్చానని, సోనియాగాంధీ నన్ను జైలులో పరామర్శించడం మరిచిపోలేదని భావోద్వేగానికి గురయ్యారు.. అయితే, ఈ రోజు సాయంత్రంలోగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేది తేల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!