Sunrisers Hyderabad Won The Toss And Chose To Bat: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఎస్ఆర్‌హెచ్‌కు.. ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్‌లోని తొలి బంతికి మొదటి వికెట్ కోల్పోయింది. యుధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ కీలక ఆటగాడు అభిషేక్ శర్మ కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అభిషేక్ లాంటి ఆటగాడు మొదట్లోనే ఔట్ అవ్వడం.. ఎస్ఆర్‌హెచ్‌కు పెద్ద ఝలకేనని చెప్పుకోవాలి. ఎందుకంటే.. గత రెండు మ్యాచ్‌ల్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల భారీ లక్ష్య ఛేధనలో అతడు అర్థశతకంతో రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
DK Shivakumar: “సోనియా గాంధీ మాటిచ్చినట్లే”.. డీకే శివకుమార్ కన్నీరు..

ఎస్ఆర్‌హెచ్ తరఫున ఓపెనింగ్ చేసిన అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ.. నిదానంగానే తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా, క్రీజులో కుదురుకున్నట్టు అనిపించారు. రెండో ఓవర్‌లో ఇద్దరు కలిసి చెరో ఫోర్ కొట్టారు. దీంతో.. ఇద్దరు కలిసి పవర్ ప్లేలో పరుగుల సునామీ సృష్టిస్తారని భావించారు. కానీ.. ఇంతలోనే ఈ జోడీకి యుధ్వీర్ సింగ్ బ్రేక్ వేశాడు. మూడో ఓవర్‌లో తొలి బంతికే అభిషేక్‌ను ఔట్ చేశాడు. అతడు ఔట్ అయ్యాక రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగాడు. మరి.. అన్మోల్, త్రిపాఠి కలిసి ఎంత మేర రాణిస్తారో చూడాలి. ఇది ఎస్ఆర్‌హెచ్‌కి డూ ఆర్ డై మ్యాచ్. ఇప్పటికీ ప్లేఆఫ్స్‌లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి, తప్పనిసరిగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అటు.. లక్నో సైతం ఐదో స్థానానికి పడిపోయింది కాబట్టి, ఆ జట్టు కూడా ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.
IPL 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్