Zelensky: రష్యా నుంచి ఉక్రెయిన్ బందీల విడుదల.. జెలెన్ స్కీ ట్వీట్
- రష్యా నుంచి బందీల విడుదలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ట్వీట్..
- బందీలను విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారు..
- కొత్త ఏడాదిలో ఇలాంటి శుభవార్తలు మరిన్నీ వినాలని ఉంది: జెలెన్ స్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని తాజాగా ఎక్స్ (ట్విటర్) వేదికగా అతడు పోస్టు పెట్టారు. రష్యా దగ్గర బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరుల విడుదలలో మిత్ర దేశాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాదిలోనే ముగియాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ కోరారు.
Read Also: Tirumala Darshanam: వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
కాగా, 2022లో ఫిబ్రవరిలో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 30 వేల మందికి పైగా చనిపోయారు. ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇక, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చించి ఈ వార్ ను ముగిస్తారని నమ్ముతున్నానని జెలెన్ స్కీ చెప్పారు. మరోవైపు, పుతిన్ కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తారని చాలా మంది అనుకుంటున్నారు.
In 2024, we managed to bring 1,358 of our people back home to Ukraine from Russian captivity. These are our soldiers and civilians.
Their fates are different, but they are equally happy to return home. Each and every one of them for the sake of whom a large Ukrainian team… pic.twitter.com/AxTPYlmYhv
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 3, 2025
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?