Shreyas Iyer doubtful for ICC World Cup 2023: సొంత గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరం కానున్నడని సమాచారం. అయ్యర్ వెన్ను గాయం కారణంగా వచ్చే ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇదే జరిగితే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ లేక భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో జట్టుకు దూరమయ్యాడు. ఆపై న్యూజిల్యాండ్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఏన్‌సీఏ)లో చేరాడు. అక్కడ రీహాబిలిటేషన్‌లో ఫిట్‌నెస్ సాధించే పనిలో పడ్డాడు. అయ్యర్ ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయ్యర్ వెన్ను నొప్పికి ఇప్పుడు కూడా ఇంజక్షన్‌లు తీసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే వన్డే ప్రపంచకప్ 2023కి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
‘శ్రేయస్ అయ్యర్ ఏన్‌సీఏలో కోలుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని మేము ఆశిస్తున్నాము. అయితే అది జరిగేలా లేదు. అయ్యర్ ఇప్పటికీ వెన్ను నొప్పికి ఇంజక్షన్‌లు తీసుకుంటున్నాడు. అప్పటివరకు ఏం జరుగుతుందో చూడాలి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఓ క్రీడా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మొత్తానికి ఇది భారత అభిమానులకు చేసు వార్తే అని చెప్పాలి. భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్ 2023 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Steve Smith Record: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
Also Read: BMW M 1000 RR Launch: 55 లక్షల విలువైన సరికొత్త బైక్.. గరిష్ట వేగం గంటకు 314 కిమీ!