BMW M 1000 RR Bike Launched in India at 49 Lakh: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎమ్ 1000 ఆర్‌ఆర్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్ ధర రూ.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 55 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ కంటే టాప్ మోడల్ ధర రూ. 6 లక్షలు ఎక్కువ. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో (స్టాండర్డ్ మరియు కాంపిటీషన్) అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్‌గా ఈ మోడల్ వస్తోంది.
BMW M 1000 RR Pre-Bookings:
ఎమ్ 1000 ఆర్‌ఆర్ బైక్ భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ మోటార్‌సైకిల్. అంతేకాకుండా ఇది అత్యంత శక్తివంతమైన రోడ్-లీగల్ బీమర్ కూడా. ఎమ్ 1000 ఆర్‌ఆర్ బైక్ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా అథరైజ్డ్ డీలర్ల వద్ద ఉన్నాయి. జూన్ 28 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఇక 2023 నవంబర్ నుంచి ఈ బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయి.
Also Read: Samsung Galaxy S23 FE Launch: ఐఫోన్ 14కి పోటీగా.. శాంసంగ్ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్!
BMW M 1000 RR Engine:
ఎమ్ 1000 ఆర్‌ఆర్ బైక్ 999 సీసీ ఇంజిన్‌తో వస్తోంది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 314 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఈ బైక్ ఇంజిన్ 14,500rpm వద్ద 212bhp శక్తిని.. 11,000 rpm వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది బీఎండబ్ల్యూ యొక్క షిఫ్ట్ కామ్ సాంకేతికతతో ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
BMW M 1000 RR Features:
ఎమ్ 1000 ఆర్‌ఆర్ బైక్ 6.5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్‌ట్రుమెంట్ ప్యానెల్, ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్ సదుపాయాలను కలిగి ఉంటుంది. రెయిన్, రోడ్, డైనమిక్, రేస్, రేస్ ప్రో 1-3 పేరిట రైడ్ మోడ్స్ ఉంటాయి. ఏబీఎస్, ఏబీఎస్ ప్రో, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. బీఎండబ్ల్యూ మోటోరాడ్ సూపర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త మైలురాయిని ఎమ్ 1000 ఆర్‌ఆర్ బైక్ నెలకొల్పిందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా అన్నారు. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల కోసం నిర్మించిన మోటార్‌సైకిల్ అని పేర్కొన్నారు.
Also Read: iPhone 14 Pro Max Price Drop: బంపర్ ఆఫర్.. రూ. 40 వేలకే ఐఫోన్ 14 ప్రో మాక్స్!