Shashi Tharoor Tweet On Sanju Samson: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీ20 స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మూడు గోల్డెన్ డక్స్‌తో దారుణంగా విఫలమైనప్పటి నుంచి.. సంజూ శాంసన్ ప్రస్తావన మళ్లీ తెరమీదకి వచ్చింది. వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ సూర్యలాంటి ఆటగాళ్లకు వరుస అవకాశాలు అందుతున్నాయని.. అదే టన్నులకొద్దీ ప్రతిభ ఉండటంతో పాటు వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంజూకి మాత్రం ఛాన్సులు ఇవ్వడం లేదని.. ఈ పక్షపాతం ఎందుకని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కొందరు మాజీ ఆటగాళ్లు సైతం ఈ విషయంలో ఫ్యాన్స్‌కి వత్తాసు పలికారు. సూర్యకి బదులు జట్టులోకి సంజూని తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Train Stopped: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్న కాంగ్రెస్.. ఇది విప్లవానికి నాంది
తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం సంజూ శాంసన్‌కి మద్దతుగా నిలిచాడు. సూర్యపై సెటైర్లు వేస్తూనే, సంజూని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదని, అతడు ఇంకా ఏం చేయాలని ట్విటర్ మాధ్యమంగా ప్రశ్నించారు. ‘‘పాపం.. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయి, ప్రపంచంలోనే అత్యంత చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఇలాంటప్పుడు సంజూ శాంసన్‌ని ఎందుకు తీసుకోవడం లేదని అడగడం.. ఎందుకు అసంజసమైనది? అతడ్ని ఆరో స్థానంలోకి బ్యాటింగ్‌కి పంపించినప్పటికీ.. వన్డేల్లో 66 యావరేజ్ కలిగి ఉన్నాడు. మరి, అతడ్ని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతడు ఇంకా ఏం చేయాలి?’’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సైతం సరైన ప్రశ్న అడిగారంటూ.. థరూర్ ట్వీట్‌కి రిప్లైలు ఇస్తున్నారు.
Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి
మరోవైపు.. సూర్యకుమార్ యాదవ్‌ను సంజూతో పోల్చవద్దని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కోరారు. ఎవరు బాగా ఆడితే, వారికే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒకవేళ సూర్యలాంటి పరిస్థితే సంజూకి వస్తే.. అప్పుడు మరొకరి గురించి మాట్లాడుకుంటామని అన్నారు. ఎవరెంత మాట్లాడుకున్నా.. టీమ్ మేనేజ్‌మెంట్ సూర్యకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, అతనికే ఎక్కువ అవకాశాలు ఇస్తుందన్నారు. అలాంటప్పుడు.. ఈ పోలికలు పనికి రావని తేల్చి చెప్పారు.
Now that poor @surya_14kumar has set an unenviable world record w/ his three golden ducks in a row, is it unreasonable to ask why @IamSanjuSamson, averaging averaging 66 in ODIs despite batting at an unfamiliar position for him at 6, wasn't in the squad? What does he need to do?
— Shashi Tharoor (@ShashiTharoor) March 23, 2023