వేసవిలో ఎండలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి.. డీహైడ్రేషన్ సమస్యలు ఎదురవుతాయి. దానికి చెక్ పెట్టాలంటే, ఈ డ్రింక్స్ తాగితే సరిపోతుంది.
నిమ్మరసం: ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండచంతో పాటు ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మజ్జిగ: ఇందులోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.
కొబ్బరి నీళ్ళు: హీట్ స్ట్రోక్, యూరినరీ సమస్యల్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థని మెరుగుపరిచి, ఎసిడిటీ నుంచి విముక్తి కల్పిస్తుంది.
చెరుకు రసం: ఇది అలసట, నిస్సత్తువను మాయం చేస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది.
సబ్జా గింజల నీరు: అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వంటి వ్యాధులకు ఇది మంచి మందుగా పని చేస్తుంది.
పటికబెల్లం వేసిన పాలు: పడుకునే ముందు ఇది తాగితే.. శరీరాన్ని చల్లబరచడంతో పాటు మంచి నిద్రకు సహాయపడుతుంది.
అరటిదిండు రసం: ఇది జీర్ణక్రియకు మేలు చేసి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
నారింజ జ్యూస్: ఇందులో ఉండే నీటి శాతం శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఇది ఎండాకాలంలో శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి.
కీరా జ్యూస్: వేసవిలో తప్పకుండా తాగాల్సిన జ్యూస్ ఇది. వేసవిలో రోజూ తాగితే శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.